సింహ‌పురికి వ‌రం విపిఆర్ విద్య‌

VARTHA VIHARI NEWS :: {✍ జోగి వేణు ✍ }: నెల్లూరు జిల్లాలో విద్యావ్య‌వ‌స్థ‌ను కొత్త పుంత‌లుతొక్కిస్తూ, అంద‌రికీ నాణ్య‌మైన ఉచిత విద్య‌ను అందించాల‌న్న సంక‌ల్పంతో రాజ్య‌స‌భ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి రెండేళ్ల క్రితం చేప‌ట్ట‌ని బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం విపిఆర్ విద్య‌. విపిఆర్ ఫౌండేష‌న్ ద్వారా గ‌త రెండేళ్ల నుంచి న‌డుస్తున్న విపిఆర్ విద్య విద్యాసంస్థ పేద పిల్ల‌ల‌ను అక్కున చేర్చుకుని, వారిని ఉన్న‌త విద్యావంతులుగా తీర్చిదిద్ద‌డంలో దిగ్విజ‌యంగా సాగుతోంది. 6వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉచితంగా అన్నీ వ‌స‌తుల‌తో నిపుణులైన అధ్యాప‌కుల‌తో నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంలో విపిఆర్ విద్య సంస్థ జ‌య‌ప్ర‌ద‌మైంది. ప్ర‌తి ఏటా ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ప్ర‌తిభ క‌లిగిన నిజ‌మైన నిరుపేద విద్యార్థుల‌ను త‌మ విద్యాసంస్థ‌లో చేర్పించుకుంటున్న విపిఆర్ విద్య సంస్థ‌లో తాజాగా మూడో అక‌డ‌మిక్ ఈయ‌ర్‌కు సంబంధించి 6వ త‌ర‌గ‌తికి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జ‌రిగాయి. బుధ‌వారం గొల‌గ‌మూడి రోడ్‌లో ఉన్న విపిఆర్ విద్య భ‌వ‌నంలో జ‌రిగిన ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌కు 271 మంది హాజ‌ర‌య్యారు. మొత్తం 30సీట్ల‌కు గాను 271 మంది ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల్లో పోటీ ప‌డ‌టం గ‌మ‌నార్హం.
విపిఆర్ విద్య‌లో అన్నీ ఉచిత‌మే!
విపిఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న విపిఆర్ విద్య‌లో చ‌దువుకునేందుకు ఎంపికైన వారికి ఆ విద్యా సంస్థ అన్నీ ఉచితంగా అందిస్తుండ‌టం విశేషం. విద్యార్థులు వేసుకునే స్కూల్ యూనిఫాం, షూస్‌, బుక్స్‌, బ్యాగ్స్‌తోపాటూ మ‌ధ్యాహ్న భోజ‌నం, ర‌వాణా సౌక‌ర్యం, త‌దిత‌ర వ‌స‌తుల‌ను విపిఆర్ విద్య‌లో ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలోనే ఏ విద్యాసంస్థ చేయ‌ని విధంగా విపిఆర్ త‌న‌దైన శైలితో ఈ స్కూల్‌ను న‌డుపుతూ పేద విద్యార్థుల భ‌విష్య‌త్తుకు బంగారు బాట‌లు వేస్తున్నారు. ప్రైవేట్, ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌లకు ధీటుగా ఉచితంగా, విద్య‌ను అందిస్తూ, రాష్ట్ర విద్యా వ్యవ‌స్థ చ‌రిత్ర‌లో క‌లికితురాయిగా విపిఆర్ విద్య నిలుస్తుండ‌టం ఎంతో సంతోష‌క‌రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *