రాజధాని నిర్మాణం అంటే రైతులను కొట్టడమా!

VARTHA VIHARI NEWS : :(✍వేణు జోగి ✍) రాజదాని ప్రాంత రైతులపై అదికారులు,పోలీసులు దౌర్జన్యం చేస్తున్న తీరు దారుణంగా ఉంది.వెలగపూడిలో గద్దె మీరా ప్రసాద్ అనే రైతు తన పొలంలో రోడ్డు నిర్మాణం చేయరాదని అన్నందుకు ఆయనపై పోలీసులు దౌర్జన్యం చేసి,దారుణంగా కొట్టారు. ఆయన బట్టలు చించేశారు.సిఐ సుధాకర్ బాబు రైతుపై చేయి చేసుకున్నాడు.ఆ రైతు సృహకోల్పోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారట. బాధిత రైతుకు మద్దతు తెలిపిన సీపీఎం, వైఎస్సార్‌ సీపీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు నుంచి మీరా ప్రసాద్ ఉత్తర్వులు తెచ్చుకున్నా,అదికారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా పనులు చేపట్టి రైతులను భయబ్రాంతులను చేస్తుండడం దారుణంగా ఉందని అంటున్నారు. సంఘటనా స్థలానికి వచ్చిన సీఆర్‌డీఏ డెప్యూటీ కలెక్టర్‌ విజయకుమారిని వివరణ కోరగా తాము పోలీసులకు భద్రత మాత్రమే కల్పించమని అడిగినట్లు తెలిపారు.రాజధాని నిర్మాణం అంటే రైతులను కొట్టడమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!